Modi: భారత తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ప్రారంభం 3 d ago

featured-image

భారతదేశంలోనే లెటెస్ట్ ఆటోమేటెడ్ టెక్నాలజీతో నిర్మించిన ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్(పంబన్ బ్రిడ్జ్)ను ఏప్రిల్ 6న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో (మండపం) నుంచి రామేశ్వరం ద్వీపానికి మధ్య ఉన్న 21.6కిలోమీటర్ల దూరాన్ని రైలు ద్వారా చేరుకునేందుకు 1914లో నిర్మించిన వంతెనపై 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టగా.. ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన కొత్త వంతెనపై కేవలం ఐదు నిమిషాలు పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నవంబర్‌లో శంకుస్థాపన చేయగా, రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ.535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ రైల్వే రాకపోకలకు అంతరాయం కలగకుండా ఓడలు ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఇది వస్తువులు, ప్రయాణికులకు సున్నితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. స్థానిక వాణిజ్యం, పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది.

లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపుతుంది. గంటకు 58 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సార్లు ఆటోమేటిక్ గా వంతెనను మూసివేస్తాయి. మత్స్యకారులు పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెన లిఫ్ట్న ఆపరేట్ చేస్తుంటారు. పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD